మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, మహిళ అభివృద్ధి తోనే దేశం పురోగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం సింగారం చౌరస్తాలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ కు మహిళా సమాఖ్య సభ్యులు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టర్ జ్యోతిని వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశంలోని ఎజెండా అంశాలైన సమాఖ్య పనితీరు, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి తదితర వాటి గురించి సమాఖ్య కార్యదర్శి నివేదిక చదివి వినిపించారు. సమాఖ్య తరపున చేపట్టిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి తోనే దేశం పురోగతి వైపు ప్రయాణిస్తుందని,మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్ధిక సహాయం పొందెలగా నూతన టెక్నాలజీ తో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వారికి శిక్షణ ఇప్పించాలని అధికారులకు సూచించారు.
సంఘాల నెలవారి సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చర్చలు అర్దవంతంగా జరగాలని అన్నీ అంశాలను ప్రతి సభ్యురాలికి చెరవేయవలేనని ఆదేశించారు. మహిళ ఎంటర్ ప్రైజెస్ సంబందించి మహిళలు ఏ విధంగా వ్యాపారాలు నిర్వహిస్తునారని లబ్ధిదారుల నుంచి వివరాలను తెలుసుకొని వారిని సభ ముఖంగా అభినందించి మిగత వారికి మార్గదర్శకం కావలెనని సూచించారు. మహిళా శక్తి కి సంబంధించి అన్ని కార్యక్రమాలను కూడా సమగ్రమైన సమాచారాన్ని గ్రామీణ స్థాయి వరకు సమాచారం ఇచ్చి ఎంసిపి లు తయారు చేసుకొని పారదర్శకంగా అమలు జరిగేలా సిబ్బంది అందరూ పని చేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలలో మహిళా శక్తి కాంటీన్ ను ఏర్పాటు చేశారని, ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సమాఖ్య సభ్యులకు సూచించారు. గ్రామాల వారిగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా చేసిన నిర్మాణ పనుల గురించి కలెక్టర్ మహిళా సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కొత్త యూనిట్ల గురించి మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని సీసీలను కలెక్టర్ ఆదేశించారు.
స్కూల్ పనులు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చూసుకోవాలని తెలిపారు. కమిటీ ద్వారా హైజినిక్, వాష్ పనులపై ఏం మెసేజ్ ఇచ్చారని తెలిపారు.
క్యాంటీన్ల నిర్వహణ ఇతర అంశాలపై హైదరాబాదులో శిక్షణ ఇస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మండల మహిళతో కలెక్టర్ మాట్లాడుతూ పచ్చళ్ళ వ్యాపారంలో ఎంత లాభం వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. దానికి మహిళా సమాధానం ఇస్తూ పచ్చళ్ళ వ్యాపారంతో తాను ఆర్థికంగా నిలదొక్కుకున్నానని తెలిపారు. దీంతో కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. రూ. 262 కోట్ల సంవత్సరం టార్గెట్ కాగా కొన్నిచోట్ల ఎన్పీఏ ఉంది అన్నారు.
బ్యాంకు లింకేజీ 21 శాతం ఉండటoపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానిని 50% వరకు పెంచాలన్నారు. ఫామ్ యూనిట్స్, క్యాటిల్ ఫీల్డ్, ఎంటర్ప్రైజెస్ తదితర అంశాలపై చర్చించారు. 11 క్యాంటీన్ల ఏర్పాటుకు లోకల్ ఐడెంటిఫికేషన్ చేయాలన్నారు. ఆగస్టు 15 వరకు టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎదురుగానే నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ పూర్తయితే కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటిన్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, చక్కటి వంటలు చేసే మహిళా సభ్యులు మన కలెక్టరేట్ లో క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరిమానరుల, డి ఆర్ డి ఓ రాజేశ్వరి, అడిషనల్ డి. ఆర్. డి. ఓ.అంజయ్య, డీపీఎంలు, ఏపీఎంలు, జిల్లాలోని అన్ని మండలాల మహిళ సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!










