టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మృతి..!
టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మృతి..!
నాగార్జునసాగర్. మన సాక్షి :
నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన ఇమామ్ ముద్దీన్ కుమారుడు మస్తాన్ వలి(14) అనే బాలుడు మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత రెండు రోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉండటంతో తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాగా మంగళవారం తెల్లవారుజామున జ్వరంతో టెంపరేచర్ పెరగడంతో మెరుగైన చికిత్స కోసం నల్లగొండకు తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు చదువుతున్న సెయింట్ జోసెఫ్ పాఠశాల యజమాన్యం మస్తాన్ వలి అకాల మరణానికి సంతాపం తెలియజేస్తూ మంగళవారం నాడు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
ALSO REA :
Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!
BREAKING : ఉద్యోగం రాలేదని మనస్థాపం.. ఉరి వేసుకొని యువకుడు మృతి..!
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!









