Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!

మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం గృహాలకు ఉచిత కరెంటు బిల్లు అందజేస్తుంది. మీరు అర్హులై ఉన్నప్పటికీ మీకు జీరో కరెంటు బిల్లు రావడం లేదా..? అయితే అలాంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అదేంటో తెలుసుకుందాం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తుంది. వాటిలో గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉన్నవారికి జీరో కరెంటు బిల్లు అందజేస్తున్నారు. జీరో కరెంటు బిల్లు కోసం ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. కాగా దరఖాస్తులలో పొరపాట్లు, ఆన్‌లైన్ చేసినప్పుడు ఆపరేటర్ల పొరపాట్ల కారణంగా అనేక మందికి జీరో కరెంటు బిల్లులు రావడం లేదు.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!

ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు స్వీకరించి మళ్లీ వారికి కూడా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కృషి చేస్తామని చెప్పింది. కానీ నేటి వరకు కూడా వారికి మోక్షం కలగలేదు. జీరో కరెంటు బిల్లులు రానివాళ్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ కొత్తగా దరఖాస్తులు చేసుకునే అవకాశం రాలేదని అధికారులు చెప్పడంతో నిరాశకు గురవుతున్నారు.

గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు గతంలో చేసుకున్నప్పటికీ వారికి జీరో బిల్లు రాని పేదలు ఉంటే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీ ఎల్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ గృహ జ్యోతి పథకంలో అర్హులైన వారందరికీ జీరో కరెంటు బిల్లు రాకుంటే మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

ALSO READGovt Land : దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా..!

గృహజ్యోతి పథకం అర్హులైన వారందరికీ వర్తించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులతో ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోసారి గృహజ్యోతికి దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించి ఉచిత విద్యుత్ అందజేయాలని అధికారులను ఆదేశించారు.

కేవలం ఎడిట్ ఆప్షన్ వల్ల అందరికీ అవకాశం రాకుండా పోతుంది. ఎడిట్ ఆప్షన్ లో కేవలం సర్వీస్ నెంబర్ తప్పు నమోదు అయిన వారికి, అద్దెకు నివాసం ఉండేవారు మార్చుకుని అవకాశం మాత్రమే కల్పించారు. గృహ జ్యోతి పథకం ద్వారా జీరో బిల్లు విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు పొరపాట్లు జరగడంతో ఎడిట్ చేసే ఆప్షన్ ఇచ్చారు.

కానీ దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేయకపోవడం, దరఖాస్తు చేసుకున్న వారికి కూడా చేసుకోలేదని రావడంతో పేద వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలందరికీ అర్హులైన వారికి ఉచిత విద్యుత్ అందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అధికారులు త్వరలో చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి : 

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రులపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్..!

LRS : ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం..!

Cm Revanth Reddy : విదేశీ పర్యటన విజయవంతం.. హైదరాబాదులో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం..!

 

మరిన్ని వార్తలు