నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలతో చెరువులకు నీళ్లు..!
నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలతో చెరువులకు నీళ్లు..!
నల్లగొండ, మన సాక్షి :
నాగార్జునసాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీటిని విడుదల చేసి చెరువుల నింపనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ డి- 37 తో పాటు 39,40,41 డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆదివారం నుండి అన్ని చెరువుల నింపే కార్యక్రమాన్ని చేపెట్టనున్నట్లు తెలిపారు.
అందువల్ల రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సంవత్సరం సరైన వర్షాలు లేకున్నప్పటికీ పైనుండి కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్ డ్యామ్ నిండి ఆ నీటిని కాలువలకు వదిలి రైతులు వ్యవసాయం చేసుకునే అవకాశం కలగడం అదృష్టమని అన్నారు.
వచ్చిన నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో భాగంగా ముందుగా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టామని, పోలీసు, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఏర్పాటుచేసి డిస్ట్రిబ్యూటరీల ద్వారా జాగ్రత్తగా నీటిని కిందికి వదలడం, చెరువులను నింపడం చేస్తున్నామని తెలిపారు.
కాలువలలో పేరుకుపోయిన పూడికను, అదేవిధంగా చెత్తను తొలగించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 15 రోజులుగా 13 మిషన్లను ఏర్పాటు చేసి వాటిని తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని చెరువులన్నింటి నింపేలా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కోరారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల చౌరస్తాను ఆర్ అండ్ బి నిధుల ద్వారా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలోని చౌరస్తాను 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు.
తిప్పర్తి మండల కేంద్రంలోని చౌరస్తా అభివృద్ధిలో భాగంగా మంచి వాతావరణం కల్పించడంతో పాటు, అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాక ఫౌంటెన్ తో పాటు, చౌరస్తా చుట్టు ఇప్పటివరకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారికి శిల్పకళా వేదికలో మాదిరిగా షాపులు నిర్మించి ఇస్తామని తెలిపారు.
అంబేద్కర్ ఇందుకుగాను చౌరస్తా అభివృద్ధి పనులకు ఇదివరకే టెండర్లను పిలవడం జరిగిందని, ఆదివారం నుండి పనులు ప్రారంభం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.చౌరస్తా అభివృద్ధి వల్ల తిప్పర్తి చౌరస్తాకు మంచి అందం వస్తుందని,తిప్పర్తి కి బైపాస్ ఉన్నందున ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగదని ,చౌరస్తా మీదుగా వెళ్లే వారికి అదేవిధంగా చౌరస్తా చుట్టూ షాపులు, ఇతర వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పార్కును, ఫౌంటెన్ ను, చెట్లను, పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేసి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పెడతామని తెలిపారు.
తెలంగాణ రావడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ముఖ్యమని, అలాంటి మహనీయుని విగ్రహాన్ని తిప్పర్తి చౌరస్తాలో ఏర్పాటు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దసరా లోపు చౌరస్తా అభివృద్ధి పనులను పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకునే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రఘువీర్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్, నల్గొండ ఆర్డీవో రవి,ఆర్ అండ్ బి ఎస్ ఈ నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రామి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
ALSO READ :
కరెంటు బిల్లుల చెల్లింపు పై కీలక ప్రకటన..!
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!









