తెలంగాణBreaking Newsఉద్యోగంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : గురుకుల పాఠశాల టాయిలెట్స్, మెస్ డోర్స్ మరమ్మతులు చేయించాలి.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

District collector : గురుకుల పాఠశాల టాయిలెట్స్, మెస్ డోర్స్ మరమ్మతులు చేయించాలి.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ మెట్ పల్లి మండలం పెద్దాపూర్ మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాలలను బుధవారం జగిత్యాల, మెట్ పల్లి, ఆర్డీఓ ల తో కలిసి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గురుకుల పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు.

ఇందులో భాగంగా గురుకుల పాఠశాలకు కాంపౌండ్ వాల్, టాయిలెట్లకు డోర్ లను, మెస్ డోర్స్, చిన్న చిన్న మరమ్మతులను చేయించాలని అధికారులకు సూచించారు. డైనింగ్ హాల్ షెడ్ నిర్మాణానికి ఎస్టిమేషన్ సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

ప్రిన్సిపాల్ మరియు టీచర్లతో విద్యార్థుల విద్యా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ మధు సుధన్, మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ జిల్లా సంక్షేమ అధికారి నరేష్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎల్. సాయిబాబా, డిప్యూటీ తహసీల్దార్, ఎంపిడిఓ, గురుకుల పాఠశాల జిల్లా కో-ఆర్డినేటర్, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!

మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!

Miryalaguda : మిర్యాలగూడ సిఐ సుధాకర్ పై వేటు..!

సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!

మరిన్ని వార్తలు