డబ్బులకు ఆశపడి ఆటో డ్రైవర్లు బ్యాంకు ఖాతాలు తెరిచారు.. కట్ చేస్తే..!
డబ్బులకు ఆశపడి ఆటో డ్రైవర్లు బ్యాంకు ఖాతాలు తెరిచారు.. కట్ చేస్తే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
డబ్బులకు ఆశపడి ఇద్దరు ఆటో డ్రైవర్లు బ్యాంకు ఖాతాలు తెరిచారు. వారిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వారి బ్యాంకు ఖాతాల నుంచి 175 కోట్ల లావాదేవీలు జరిపిన సంఘటన హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసింది.
వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ఇద్దరు ఆటోడ్రైవర్లను అనుసరించారు. వారు సైబర్ క్రైమ్ నేరగాళ్లకు డబ్బులకు ఆశపడి సహకరించారు. జాతీయ బ్యాంకులలో ఆరు ఎకౌంట్లు ఆటో డ్రైవర్లు ఓపెన్ చేశారు. వారి ద్వారా 175 కోట్ల రూపాయల లావాదేవీలు సైబర్ నేరగాళ్లు జరిపారు. హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు డబ్బులు బదిలీ చేశారు.
క్రిఫ్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్ ఫర్ చేసిన ఆటో డ్రైవర్లు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులను తరలించారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బులు లావాదేవీలు నిర్వహించారు.
ఆటో డ్రైవర్ల ఖాతాలు సుమారు 600 కంపెనీల అకౌంట్ లకు సైబర్ నేరగాళ్లు లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల వెనుక చైనా నేరస్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆటో డ్రైవర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.
LATEST UPDATE :
BREAKING : దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది సస్పెండ్..!
HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!









