Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking Newsతెలంగాణ

MLC KAVITHA : జైలు నుంచి కవిత విడుదల.. వెంటనే భావోద్వేగం..!

MLC KAVITHA : జైలు నుంచి కవిత విడుదల.. వెంటనే భావోద్వేగం..!

మన సాక్షి :

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి MLC కవిత మంగళవారం రాత్రి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మాకు టైం వస్తది.. అంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

జైలు నుంచి విడుదల కాగానే కవిత భర్త అనిల్, కుమారుడు ఆర్య, సోదరుడు కేటీఆర్ తో పాటు హరీష్ రావు తదితరులు జైలు వద్దకు వెళ్లారు. వైద్య పరీక్షలతో పాటు జైలు నిబంధనలు పూర్తి చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.10 గంటలకు జైలు నుంచి ఆమెను విడుదల చేశారు.

సోదరుడు కేటీఆర్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన చెల్లిని ఎదుటి పై ముద్దు పెట్టారు. అనంతరం ఆమె తన భర్త అనిల్, కుమారుడు ఆదాయ ను కౌగిలించుకున్నారు. నేతలకు ఆమె అభిమానం చేశారు.

జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యుల ప్రస్తావించిన క్రమంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

LATEST UPDATE : 

HYDRA : హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్ వైపేనా.. అధికారుల కొలతలు ప్రారంభం..!

Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!

మరిన్ని వార్తలు