అర్హత లేకుండా వైద్యం.. క్లినిక్ సీజ్..!
అర్హత లేకుండా వైద్యం.. క్లినిక్ సీజ్..!
సూర్యాపేట, మనసాక్షి :
అనుమతులు లేకుండా, అర్హతలు లేకుండా ఆసుపత్రులు నిర్వహించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించినారు . పట్టణములో నిర్వహిస్తున్న శ్రీ సత్యనారాయణ క్లినిక్ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్నందున గతంలో క్లినిక్ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడినది.
అయినప్పటికీని రిజిస్ట్రేషన్ లేకుండా, అర్హత లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్ ను తనిఖీ చేసినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తమ అధికార బృందం చే సీజ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జి చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిత రాణి, గణాంక అధికారి పి వీరయ్య, ఇన్చార్జిడెప్యూటీ డేమో మనోహరా రాణి పాల్గొన్నారు.
LATEST UPDATE :
MLA : ఎమ్మెల్యే రాసలీలలు.. వీడియో లీక్, పార్టీ నుంచి సస్పెండ్..!
Miryalaguda : మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదా.. విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి నారాయణన్..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!
Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!









