BIG BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. రాష్ట్రంలో హై టెన్షన్..!
BIG BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. రాష్ట్రంలో హై టెన్షన్..!
హైదరాబాద్, మన సాక్షి :
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య డైలాగ్స్ వార్ నడుస్తుంది. ఇద్దరు కూడా బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలిచిన వారే. కానీ ఒకరు కాంగ్రెస్ లో చేరారు. మరొకరు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు.
అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నారంటే తన ఇంటికి వెళ్లి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతాను అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
ఈ విషయంపై అరికెపూడి గాంధీ మాట్లాడుతూ బుధవారం ఉదయం 11 గంటల వరకు వేచి చూస్తాను. రాకుంటే నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను. అంటూ హాట్ కామెంట్ చేశారు. ఓ దుర్మార్గుడు నా ఇంటిపై జెండా ఎగరవేస్తానంటే ఊరుకోను అంటూ హెచ్చరించారు.
కౌశిక్ రెడ్డి ఇంటికి నేనే వెళ్తా అంటూ అరికెపూడి గాంధీ కాన్వాయ్ తో బయలుదేరి వెళ్తున్నారు. కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. బుధవారం ఉదయం కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వెళ్లడానికి సిద్ధమైన వెళ్లలేదు. కానీ గాంధీ మాత్రం కౌశిక్ రెడ్డి నివాసానికి సవాల్ చేసి మరి వెళ్తున్నారు. దాంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
LATEST UPDATE :
Cm Revanth Reddy : షెటిల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి..!
మిర్యాలగూడ : ఈ ముఠాలో మామూలోళ్లు కాదు.. ఏకంగా ధర్మల్ పవర్ ప్లాంట్ కే కన్నం..!









