Nagarjunasagar : విద్యుత్ ఉత్పత్తిలో అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు.. CMD హెచ్చరిక..!
Nagarjunasagar : విద్యుత్ ఉత్పత్తిలో అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు.. CMD హెచ్చరిక..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగర్జున సాగర్ లో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తిని చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎం డి రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాగార్జునసాగర్ లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జన్కో సీఎండి రోనాల్డ్ రోస్ సందర్శించి పరిశీలించారు.
అనంతరం స్థానిక జెన్కో ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో పుష్కలంగా నీరు ఉన్నందున సాగర్ లోని జల విద్యుత్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేయాలని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యుత్ ఉత్పత్తిలో ఏవైనా సమస్యలు ఏర్పడితే వెంటనే తన దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు. జల విద్యుత్ కేంద్రాలలో టర్బన్ల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని అన్నారు.
అనంతరం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. వీరితోపాటు హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజన్, స్థానిక జెన్కో సీఈ మంగేష్ నాయక్, ఎస్సీలు రఘురాం ,రామకృష్ణారెడ్డి, డి ఈ లు ప్రసాద్ ,ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
FTL : బఫర్ జోన్, FTLలో అక్రమ నిర్మాణాలు చేస్తే తొలగిస్తాం.. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక..!
Miryalaguda : ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!










