Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుహైదరాబాద్

Khairatabad : అత్యంత వైభవంగా సాగుతున్న ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర..!

Khairatabad : అత్యంత వైభవంగా సాగుతున్న ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర..!

హైదరాబాద్, మన సాక్షి :

దేశంలోనే పేరుగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. భారీ పోలీసు బందోబస్తు తో భక్తుల కోలాహాలంతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. సోమవారం రాత్రి 10 గంటల తర్వాత కలశపూజ నిర్వహించి భారీ ట్రాలీపై ఎక్కించే ప్రక్రియ చేపట్టారు.

మంగళవారం తెల్లవారుజాము నుంచి మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ వరకు గణేశుడు శోభాయాత్ర సాగనున్నది.

రెండున్నర కిలోమీటర్ల మేర గణేశుడి శోభాయాత్ర చేపట్టి ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన నాలుగవ నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల లోపే మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

ట్రాఫిక్ మళ్లింపులు : 

గణేష్ శోభాయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. నిబంధన నిమజ్జన బందోబస్తుకు 10వేల మంది పోలీసులు మోహరించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోనే 3,000 మంది పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అదే విధంగా ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. శోభాయాత్ర నేపథ్యంలో పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతుంది. హైదరాబాద్ మెట్రో కూడా అర్ధరాత్రి రెండు గంటల వరకు సర్వీసులు నిర్వహించనున్నారు.

70 ఏళ్లు పూర్తయిన ఖైరతాబాద్ గణపతి :

హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 70 అడుగుల మేర మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1954లో ఖైరతాబాద్ ఒక అడుగు ఎత్తుతో గణపతి విగ్రహం ఏర్పాటు చేయగా.. ఇప్పుడు 70 అడుగుల మేర విగ్రహం ఏర్పాటు చేశారు.

ఎంతో అద్భుతంగా మహాగణపతి పక్కన కుడివైపున 10 అడుగుల ఎత్తున ప్రత్యేక అయోధ్య తరహాలో బాలరాముడి విగ్రహం. ఎడమవైపున 9 అడుగుల ఎత్తులో రాహుకేతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. గణపతి పాదాల చెంత మూడు అడుగుల ఎత్తులో మూషిక వాహనం ఉంది. కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

LATEST UPDATE : 

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

Suryapet : రూ.1.25 లక్షలు పలికిన గణేష్ లడ్డు.. పంపిణీ చేసిన మాజీ మంత్రులు..!

పిల్లిగుండ్ల గణేష్ లడ్డూ వేలం రూ. 2. 20 లక్షలు..!

Nalgonda : గణేష్ శోభాయాత్రలో మంత్రి కోమటిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ..! 

మరిన్ని వార్తలు