తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : కత్తులతో బెదిరించి దోపిడీ.. సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన..!

Suryapet : కత్తులతో బెదిరించి దోపిడీ.. సూర్యాపేట జిల్లాలో సంచలన ఘటన..!

మేళ్లచెరువు, మనసాక్షి:

కత్తులతో బెదిరించి ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామంలో బుధవారం అర్దరాత్రి దాటాక చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని గురువారం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్,అడిషినల్ ఎస్పీ నాగేశ్వర్ రావు సందర్శించి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా పరిశీలించారు.

పోలీసులు తెలిపిన వివరాలను బట్టి…ఎపి లోని నందిగామకు చెందిన ఉప్పుతల వెంకయ్య గా పదిహేనేళ్లుగా వెల్లటూరు శివారులో ఇటుకల తయారీ యూనిట్ నడుపుతున్నాడు. కోదాడలో ఉండే వెంకయ్యకు పిల్లనిచ్చిన మామ చనిపోవడంతో భార్య ఇద్దరు కూతుర్లను తీసుకుని ఆ కార్యక్రమానికి వెళ్లాడు.

భార్యను అక్కడే ఉంచి పని‌ ముగించుకుని తిరిగి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో వెంకయ్య, బీటెక్ చదువుతున్న ఇద్దరు కూతుర్లను తీసుకుని ఇంటికి చేరుకుని పడుకున్నారు.

తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఐదుగురు దుండగులు ఇంటి డోర్ గొళ్లాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ముఖానికి మాస్కులు, గ్లౌజ్, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురి మెడలపై కత్తులు పెట్టి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను గుంజుకున్నారు.

డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయో చెప్పాలని బెదిరించారు. భయంతో బీరువా తాళం చెవులు ఇవ్వడంతో అందులో ఉన్న ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు,30 తులాల వెండి వస్తువులు, 50 వేల నగదును అపహరించారు.

విషయం ఎవరికీ చెప్పొద్దని, చెపితే మళ్లీ వచ్చి చంపేస్తామని దుండగులు బెదిరించారు. వెళుతూ సెల్ ఫోన్లను బయటకు విసిరేసి పరారయ్యారు. సెల్ ఫోన్ వెతికి వెంకయ్య తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అక్కడి కి స్నేహితులు చేరుకునే లోపే దుండగులు పరారయ్యారు.

కేసు నమోదు చేసి మొత్తం ఘటనపై విచారణ చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ రజితారెడ్డి, ఎస్సైలు పరమేష్, సైదిరెడ్డిలు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!

దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!

Malkajgiri : అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. కూల్చివేసిన అధికారులు..!

మరిన్ని వార్తలు