Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda: నల్గొండ జిల్లాలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..!

Nalgonda: నల్గొండ జిల్లాలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..!

చింతపల్లి, మన సాక్షి :

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని వింజమూరు గ్రామానికి చెందిన యాచారం జంగయ్య గౌడ్ శనివారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అదే సమయంలో ఉరుములు మెరుపులు వచ్చాయి. పొలంలో ఒంటరిగా పడి ఉండడంతో పక్క వ్యక్తులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

వెంటనే అతని భార్య మృతుడి తమ్ముడు ఆటోలో హటావోటిన జంగాయను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మాల్ సమీపంలో గల పీపుల్స్ హాస్పిటల్ కు తీసుకురాగా జంగయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.

మృతుడు మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా పిడుగుపాటుకు గురయ్యాడా లేక ఇంకే కారణమైన ఉండొచ్చని వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు 45 సంవత్సరాల వయసు కలిగఉన్నట్లు సమాచారం. మృతునికి భార్య ఇరువురు పిల్లలు కలిగి ఉన్నారు.

ఇటీవలనే మృతుడు యాచారం జంగయ్య వింజమూర్ గ్రామ శాఖ గౌడ సంఘ అధ్యక్షుడుగా కూడా ఎన్నికయ్యారు. వారి మరణం కుటుంబ సభ్యులకు అంతు పట్టడం లేదు.. జంగయ్య మృతికి గురి కావడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.

LATEST UPDATE : 

BIG BREAKING : బాలికలతో తప్పుగా ప్రవర్తన.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!

District collector : మంథని బిల్ కలెక్టర్ సస్పెన్షన్.. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్..!

E pass : ఈ పాస్ లో నమోదు చేయకుండా ఎరువులు విక్రయిస్తే చర్యలు..!

మరిన్ని వార్తలు