Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Trainee Collector : ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన ట్రైనీ కలెక్టర్ గరిమా..!

Trainee Collector : ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన ట్రైనీ కలెక్టర్ గరిమా..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ట్రైనీకలెక్టర్ గరిమ నరుల అధికారులకు సూచించారు. జిల్లాకలెక్టర్ కార్యాలయ ప్రజావాణి మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ట్రైని కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 34 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు