Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవిద్య

DSC : డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామకాలు అప్పుడే..!

DSC : డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామకాలు అప్పుడే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

Dsc : డి ఎస్ సి అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణ తోపాటు ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం నియామకాలను చేపట్టేందుకు కసరత్తు నిర్వహిస్తుంది. దసరా పండుగ నాటికి వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు.

డీఎస్సీ 2024 ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. ఈనెల 5వ తేదీ లోగా సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేయనున్నారు. 5వ తేదీలోగా సర్టిఫికెట్ల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 11062 ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గాను నిర్వహించిన డీఎస్సీ నాలుగు రోజుల క్రితం ఫలితాలను విడుదల చేశారు. 1:3 ప్రకారం ఫలితాలను విడుదల చేయగా మెరిట్ లిస్టు ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలన 5వ తేదీ పూర్తి కానున్నది.

వీరందరికీ దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 9 వ తేదీన నియామక పత్రాలను అందజేయనున్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయ నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేయనున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు