తెలంగాణBreaking Newsరాజకీయం

MallaReddy : ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొన్నంతో మల్లారెడ్డి భేటీ.. రేపు రేవంతు..?

MallaReddy : ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొన్నంతో మల్లారెడ్డి భేటీ.. రేపు రేవంతు..?

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదివారం ప్రగతి భవన్ లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. మల్లారెడ్డి తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో కలిసి వారిని కలిశారు.

మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఉన్న నేపథ్యంలో వీరు ఇరువురు వారిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజశేఖర్ రెడ్డి దంపతులతో పాటు మల్లారెడ్డి కలిసి వివాహానికి ఆహ్వానించారు.

కేటీఆర్, హరీష్ రావుకు సైతం వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు. కాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా రేపు కలిసి ఆహ్వాన పత్రిక అందజేస్తారని ప్రచారం సాగుతుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు