Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

మద్యం తాగిన మైకంలో ఉరి వేసుకొని మహిళ మృతి..!

మద్యం తాగిన మైకంలో ఉరి వేసుకొని మహిళ మృతి..!

లక్షెట్టిపేట్, (మన సాక్షి) :

మంచిర్యాల జిల్లా  Aలక్షెట్టిపేట మండలం చెల్లంపేట గ్రామానికి చెందిన జైనేని భీమక్క(35)సంవత్సరాల మహిళ ఆదివారం మధ్యాహ్నం తాగిన మైకంలో భర్తతో గొడవపడి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించింది.

మృతురాలి అదే గ్రామానికి చెందిన జైనేని రవి తో 20 సంవత్సరాల క్రితం వివాహం కాగా పిల్లలు పుట్టలేదు. ఇద్దరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఇద్దరు రోజు అతిగా మద్యం సేవించి గోడవపడుతారని మృతురాలు తాగిన మైకంలో భర్తపై చేయి చేసుకుంటుందని స్థానికులు కుటుంబీకులు చెప్పారు.

అదే క్రమంలో ఆదివారం ఉదయం నుండే ఇద్దరు తప్పతాగి గోడవపడటంతో పాటు మృతురాలు తన భర్తను కొట్టి రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతురాలి తమ్ముడు చేదం రాజన్న పిర్యాదు మేరకు రెండవ ఎస్ఐ రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని లక్షేట్టిపేట్ ఎస్సై సతీష్ తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు