Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Groups : గ్రూప్ – 3 పరీక్ష రాసే వారికి గుర్తింపు కార్డు తప్పనిసరి..!

Groups : గ్రూప్ – 3 పరీక్ష రాసే వారికి గుర్తింపు కార్డు తప్పనిసరి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఈనెల 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో 4200 మంది విద్యార్థులు గ్రూప్ 3 పరీక్షలు సజావుగా రాసేందుకు 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 45 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, 4 రూట్ ఆఫీసర్లు, 13 మంది చీఫ్ సూపర్డెంట్లు, 15 మంది పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారని తెలిపారు. కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ స్ట్రాంగ్ రూమ్ లోకేషన్ అని తెలిపారు.

అన్ని పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈనెల 17వ తేదీన పేపర్ 1 పరీక్ష ఉదయం 10 గంటల నుండి ప్రారంభం కానుండగా, అభ్యర్థులను 8:30 వరకే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు.

పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుండగా 1:30 లోపే కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ఈనెల 18వ తేదీన పేపర్ 3 పరీక్ష ఉదయం 10 గంటల నుండి ప్రారంభం కానుండగా, అభ్యర్థులను 8:30 వరకే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు.

నిర్దేశిత సమయం దాటిన తర్వాత, అభ్యర్థులను లోపలికి అనుమతించ బోమని తెలిపారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు, విద్యార్థులకు చెక్ చేసి పంపడం తదితర అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు తెలియజేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు