Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : జిల్లా కలెక్టర్ చే సన్మానం అందుకున్న ఆ వర్కర్లు..!

Narayanpet : జిల్లా కలెక్టర్ చే సన్మానం అందుకున్న ఆ వర్కర్లు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

జిల్లాలోని ప్రతీ ఇంటికి తప్పనిసరిగా మరుగు దొడ్డి ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మంగళవారం అంతర్జాతీయ మరుగు దొడ్ల దినోత్సవం సందర్భంగా డీ డబ్ల్యూ ఎస్ ఎం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మల్టీపర్పస్ వర్కర్లు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరుగు దొడ్డి ని నిర్మించుకునే విధంగా వర్కర్లు వారికి అవగాహన కల్పించాలన్నారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని గ్రామాల వారీగా మంజూరైన మరుగుదొడ్లు, విడుదల చేసిన నిధుల వివరాలను అధికారులు ఎజెండా ద్వారా వెల్లడించారు.

అనంతరం నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన మల్టీపర్పస్ వర్కర్స్ భారతమ్మ, జాజాపూర్ గ్రామానికి చెందిన మణెమ్మ, ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన సిద్ధిరాములు, అభంగాపూర్ గ్రామానికి చెందిన కనకప్పను జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, డి ఆర్ డి ఓ మొగులప్ప. డిపిఓ కృష్ణ, డిఇఓ అబ్దుల్ ఘని, జిల్లా వైద్యానికి శాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డిపిఆర్ఓ రషీద్, డీఏవో జాన్ సుధాకర్,డి డబ్ల్యు ఓ జయ, ఎంపీడీవో సుదర్శన్, ఎంఈఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు