Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతాంగం కు రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం భరోసా కల్పించింది. వానాకాలం సీజన్ లో రైతుల పెట్టుబడి కోసం సహాయం చేయాల్సిన రైతు భరోసా పథకం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. వానాకాలం సీజన్ పూర్తయ్యి యాసంగి సీజన్ కూడా ప్రారంభం అవుతుంది. . అయినా కూడా రైతులకు మొదటి పంటకు పెట్టుబడి సహాయం అందలేదు.
మంత్రులు రోజుకో మాట చెబుతూ కాలం వెళ్ళబుచుతున్నారే తప్ప రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రెండు సీజన్లకు పదివేల రూపాయల పెట్టుబడి సహాయం చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరానికి 15 వేల రూపాయల పంట సహాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కానీ ఇచ్చిన హామీ ఏడాది గడిచినా.. అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు బంధు పథకంలో అవినీతి జరిగిందని, రైతు భరోసా పథకాన్ని పంట సాగు చేసే రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నిబంధనలు తయారు చేయడానికి గాను సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, రైతుల అభిప్రాయ సేకరణ చేయడం వల్ల ఆలస్యమైంది.
ఏడాది ప్రభుత్వ సంబరాల్లో సైతం రైతులకు రైతు భరోసా లేకుండానే పోయింది. కాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా పై స్పష్టం చేశారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాతనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
రైతులు ఎలాంటి అపోహలకు పాల్పడవద్దని, రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, సాంకేతిక కారణాలవల్ల కొద్ది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ కాలేదని దానివి కూడా అతి త్వరలో నిధులు విడుదల చేసి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు.
గత ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ చేసినా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, తమ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ వల్ల రైతులకు ఒకేసారి బ్యాంకు రుణాలు మాఫీ అయినట్లు ఆయన పేర్కొన్నారు.
MOST READ :
-
Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!
-
Miryalaguda : చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం.. హార్టికల్చర్ లో సీటు వచ్చినా.. ఫీజు కట్టలేక కూలి పనికి..!
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!
-
WhatsApp : వాట్సాప్ లో ఇక అదిరిపోయే ఫీచర్.. వాయిస్ మెసేజ్ కూడా Textగా, అది ఎలా అంటే..!









