District collector : ప్రభుత్వ లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ప్రభుత్వ లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నల్లగొండ, మన సాక్షి :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధామ్య పథకాలకు జిల్లా అధికారులు ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు లక్ష్యాలను పూర్తిచేసేందుకు కృషి చేయాలని చెప్పారు.
మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంగన్వాడీలు, పాఠశాలలు, రెసిడెన్సి పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో ఎలాంటి చిన్న లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తాను కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఆహారాన్ని తనిఖీ చేయడం జరిగిందని, అన్ని పాఠశాలలో సంక్షేమ వచక గృహాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్బాగా నిర్వహిస్తుండడం పట్ల ఆమె అధికారులకు అభినందనలు తెలియజేశారు.
మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో జరిగే అన్ని అంశాలపై దృష్టి సారించి ప్రత్యేక చొరవ చూపించాలని అన్నారు. ముఖ్యంగా సంబంధిత శాఖల అధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
ఎక్కడ సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, టీఎస్ ఐపాస్ కమిటీకి పరిశ్రమల ఏర్పాటుకై వచ్చిన దరఖాస్తులను సమీక్షించి కమిటీ ద్వారా అనుమతులు ఇచ్చారు.
అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మండలాల ప్రత్యేక అధికారులు పరిశీలించాలని చెప్పారు.డిఆర్ఓ అమరేందర్, ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.కాగా ఈ సోమవారం( 52) మంది ఫిర్యాదుదారులు ఫిర్యాదులను సమర్పించారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
-
Miryalaguda : చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం.. హార్టికల్చర్ లో సీటు వచ్చినా.. ఫీజు కట్టలేక కూలి పనికి..!
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!
-
WhatsApp : వాట్సాప్ లో ఇక అదిరిపోయే ఫీచర్.. వాయిస్ మెసేజ్ కూడా Textగా, అది ఎలా అంటే..!









