Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. అయోమయంలో రైతులు..!

Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. అయోమయంలో రైతులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ కానుకగా రైతుల ఖాతాలో యాసాంగి పంటకు సంబంధించిన రైతు భరోసాను ఎకరానికి 7500 అందించనున్నట్లు ప్రకటించారు. దాంతో రైతులు అయోమయంలో పడిపోయారు.

ప్రభుత్వం వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పంట సహాయం అందించలేదు. కాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లల్లో అర్థం ఏంటని ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా ఇస్తున్నారా..? యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా ఇస్తున్నారా..? అర్థం కాని పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా ఒక పంటకు రైతు భరోసా ఇస్తున్నట్లుగా రైతులు భావిస్తున్నారు. కానీ వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా లేనట్టేనా..? అని ఆందోళన, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం యాసంగి పంటలకు సంబంధించిన రైతు భరోసా పంట సహాయాన్ని డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది.

కానీ జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా జమ చేస్తామని చెప్పిన మంత్రి మాటలకు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలకు సంబంధించిన రైతు భరోసా సహాయం లేనట్టేనా..? అని భావిస్తున్నారు. అయితే వానాకాలం సీజన్ కు సంబంధించిన పంట సహాయం జమ చేస్తారా..? యాసంగి సీజన్ కు సంబంధించిన పంట సహాయం జమ చేస్తారా..? అనేది వేచి చూడాల్సి ఉంది.

ఐదు ఎకరాల లోపే రైతు భరోసా..?

గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో వందల ఎకరాలు ఉన్న రైతులకు, సాగుకు పనికిరాని భూములకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు రైతులకు అందజేసింది. కాగా నిధులు దుబారా అయ్యాయని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది.

రైతుల అభిప్రాయాలను సేకరించింది. రైతుల అభిప్రాయం మేరకు చిన్న రైతులకు మాత్రమే పంట సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. దాంతో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందజేయాలని భావించినట్లు సమాచారం.

డిసెంబర్ నెలలో నిర్వహించే మంత్రి వర్గం భేటీ అయి రైతు భరోసా పై చర్చించిన తర్వాతనే అర్హతలు నిర్ణయించనున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం.

MOST READ : 

మరిన్ని వార్తలు