Breaking NewsTOP STORIES

Gold Price : మరోసారి తగ్గిన పసిడి ధర.. తులం ధర ఎంతంటే..!

Gold Price : మరోసారి తగ్గిన పసిడి ధర.. తులం ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర మరోసారి తగ్గింది. తెలుగు మహిళలు పసిడి ధర రోజురోజుకు తగ్గడంతో ఆనందంలో ఉన్నారు. దాంతో బంగారం కొనుగోలు వేగం పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మంచి రోజులు కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడం.. బంగారం ధర తగ్గడం వల్ల మహిళలు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

శనివారం ఒక్కరోజు 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 1100 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ కు 1000 రూపాయలు తగ్గింది.

నవంబర్ 29వ తేదీన 10 గ్రాముల 22 క్యారెట్స్ (తులం బంగారం) 71,600 రూపాయలు ఉండగా నవంబర్ 30వ తేదీన 71500 రూపాయలుగా ఉంది. వంద రూపాయలు తగ్గింది. 24 క్యారెట్స్ నవంబర్ 29వ తేదీన 78,110 రూపాయలు ఉండగా నవంబర్ 30వ తేదీన 78,000 ఉంది. 110 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో కొనసాగుతున్న ఈ బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బంగారం ధర మరింతగా తగ్గుతుందని మహిళలు భావిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు