Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య..!

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లాలోని వాజీడు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గోదావరి బ్రిడ్జి సమీపంలోని రిసార్ట్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రిసార్ట్ కు ఆదివారం రాత్రి 9 గంటలకు తన ప్రియురాలతో కలిసి వెళ్లినట్లు సమాచారం. కాగా తన వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.?ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని ప్రియురాలు అక్కడే ఉంది.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా ఆత్మహత్యకు సంబంధించిన కోణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు హరీష్ పెళ్లి విషయంలో సంబంధాలు చూస్తున్నట్లు సమాచారం.

MOST READ : 

మరిన్ని వార్తలు