Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

Nalgonda : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

కొండమల్లేపల్లి , మనసాక్షి :

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. 32 బస్తాల రేషన్ బియ్యం అందజు 16 క్వింటాలు ను పట్టుకొని సదర్ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మరియు గుడిపల్లి మండలం నుంచి బొలెరో వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని పెళ్లి పాకల ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న బియ్యమును పట్టుకున్నట్లు తెలిపారు.

రేషన్ బియ్యం తరలిస్తున్న రమావత్ రాము అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు