District collector : ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
District collector : ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా, పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మండలంలోని జాజాపూర్ గ్రామం హరిజన వాడలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా సర్వే కొనసాగుతోందని ప్రతిరోజు సర్వే నివేదికలు ప్రభుత్వానికి ఆన్ లైన్ విధానం ద్వారా పంపించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం సూచించిన ప్రకారం ఖచ్చితమైన సమాచారం క్షేత్రస్థాయిలో సేకరించాలని సిబ్బందికి సూచించారు. హరిజనవాడలోని రెండు నివాసాల వద్ద ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఎలా జరుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్, ఈడిఎం విజయ్, గ్రామపంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు రెడీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!
-
TG News : రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాలలో రూ. 6వేలు..!
-
Dharani : తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల కోసం.. సరికొత్త సేవలు..!









