Breaking Newsక్రైంతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఘోర బస్సు ప్రమాదం..!

Miryalaguda : మిర్యాలగూడలో ఘోర బస్సు ప్రమాదం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై రాళ్లకుప్పకు ఢీ కొట్టింది.

దాంతో బస్సులో ప్రయాణికులు అంతా ఆహాకారాలతో భయాందోళనలకు గురయ్యారు. బస్సు ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పదిమందికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది.

ఈ సంఘటన సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులో, అతివేగంగా ఉన్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు