Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Sand : ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ లో భారీగా ఇసుక అక్రమ రవాణా..!

Sand : ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ లో భారీగా ఇసుక అక్రమ రవాణా..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ లో భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇష్టానుసారంగా మల్లారం మల్కాపురం, నుండి వల్లభి మంగాపురం మీదగా భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు సంబంధం లేనట్టుగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

రెవిన్యూ అధికారుల పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా రోజుకు ఒక్కొక్క ట్రాక్టర్ 10 ట్రిప్పులు తోలుకుంటున్న పట్టించుకునే వారు లేరని అంటున్నారు. ఒక్కొక్క ట్రిప్పు 6వేల నుండి 8 వేల వరకు తోలుకుంటు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా సంబంధిత పై అధికారులు చర్యలు తీసుకొని పర్మిషన్ లేని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు కోరారు

MOST READ : 

మరిన్ని వార్తలు