Cm RevanthReddy : సంక్రాంతికి వస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి..!
Cm RevanthReddy : సంక్రాంతికి వస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం వల్ల సంక్షేమ పథకాల అమలు కాస్త ఆలస్యం అవుతుంది.
అయినా కూడా ఇచ్చిన హామీలలో అన్నింటిని అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. 2025 సంక్రాంతి పండుగకు ప్రతి ఇంటికి నేను వస్తున్నానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రెండు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాటిలో ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన సర్వే కొనసాగుతుంది. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. అర్హులను నిర్ణయించేందుకుగాను ప్రత్యేక యాప్ లో వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. అందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3000 ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధమైంది. ఒక్కొక్క అర్హుడైన లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలను అందజేయనున్నారు. ఈ పథకాన్ని సంక్రాంతి పండుగకు ప్రారంభించనున్నారు.
అదే విధంగా రెండోది రైతు భరోసా పథకం. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. వానకాలం సీజన్ లో రైతు భరోసా పథకం అమలు చేసి పెట్టుబడి సహాయంగా ఎకరానికి 15000 రూపాయలు అందజేస్తారని భావించిన రైతులకు నిరాశ కలిగింది.
కాగా రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సంక్రాంతికి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఎకరానికి ఒక విడత 7500 చొప్పున రైతుల ఖాతాలలో నేరుగా జమ కానున్నాయి. రైతుబంధు పథకంలో అనేక లోపాలను సరిదిద్ది రైతు భరోసాను ప్రారంభించనున్నారు. ఈ పథకంలో అర్హులైన రైతులందరికీ 7500 చొప్పున రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.
MOST READ :
-
Gold Price : రెండు రోజుల్లో పసిడి ధరలు.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!









