Nalgonda : ప్రభుత్వ రంగంలోనే విద్యావ్యవస్థ ఉండాలి.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి..!
Nalgonda : ప్రభుత్వ రంగంలోనే విద్యావ్యవస్థ ఉండాలి.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి..!
గురుకులాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి
ప్రైవేట్ టీచర్లందరినీ రెగ్యులర్ చేయాలి .
టీఎస్ యుటిఎఫ్ మహాసభలు విజయవంతం.
నల్లగొండ, మన సాక్షి .
విద్యా వ్యవస్థ మొత్తం ప్రభుత్వ రంగంలో ఉండాలని అప్పుడే పూర్తిగా విద్య పేద పేద విద్యార్థులకు అందుతుందని దాని ద్వారా దేశం సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. యుటిఎఫ్ ఆరవ మహా సబల సందర్భంగా స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నల్లగొండలో నిర్వహిస్తున్న యుటిఎఫ్ ఆరవ రాష్ట్ర మహాసభలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించాలని ప్రతి తరగతిలో 15 మంది విద్యార్థులు ఉండేలా చూడాలన్నారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 15% నిధులు కేటాయించాలని అలాగే కేంద్ర ప్రభుత్వం తగ్గించిన శాతాన్ని వెంటనే ఇదివరకు మాదిరిగానే కేంద్ర నిధులు పెంచాలని కోరారు.
యూజీసీని పునరుద్ధరించాలని ఫ్రీ ప్రైమరీ స్కూళ్లకు బడ్జెట్ కేటాయించాలని మధ్యాహ్న భోజనానికి గురుకులాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు .సమాజానికి బడి ఒకటి నినాదం నినాదంతో ప్రభుత్వం పని చేయాలన్నారు.
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని టెంపరరీ టీచర్లు అందరిని క్రమబద్ధీకరించాలని ఆయా పాఠశాలలో పిల్లలు వికృత శ్రేష్ఠులకు పాల్పడుతున్నారని అటువంటి వారికి బోధన పద్ధతులు మార్చి వారికి విశ్రాంతి లేకుండా ఇటువంటి చేష్టల పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ 2009 విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దేనిని నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆరోపించారు. విద్యాహక్కు చట్టానికి పూర్తి నిధులు కేటాయించాలని జాతీయ విద్యా విధానం అమలు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు .
డి ఎ ,పి ఆర్ సి, హెల్త్ కార్డుల, సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఆదాయ పన్ను మినహాయింపు ఎనిమిది లక్షల వరకు పెంచాలని కోరారు . ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ ఉపాధ్యక్షులు రాములు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Wonder Girl : అతి చిన్న వయసులోనే ఇండియన్ గర్ల్ కార్తికేయన్ ప్రపంచ రికార్డ్.. 16ఏళ్ళ వయసులోనే 7 ఎత్తైన పర్వతాలు..!
-
Cell Phones : కాలేజీల్లో సెల్ ఫోన్ ఎంట్రీపై ఉన్నత విద్యామండలి కొత్త రూల్..!
-
2024 Google Top Search in World : 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్‌లో మొదటి స్థానం ఎవరిది.. ఏది ఎక్కువగా సెర్చ్ చేశారు..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!









