Nalgonda : క్రమశిక్షణతో పని చేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్..!
Nalgonda : క్రమశిక్షణతో పని చేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి.. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్..!
నల్లగొండ, మన సాక్షి :
పోలీస్ శాఖలో అంకితభావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం రమేష్ ట్రైనీ కానిస్టేబుల్లకుకు సూచించారు. అన్నేపర్తి 12వ బెటాలియన్ లో 9 నెలల పాటు శిక్షణ అనంతరం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం బెటాలియన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తొమ్మిది నెలల బేసిక్ ఇండెక్షన్ ట్రైనింగ్ ,వికారాబాద్,కామారెడ్డి, రామగుండం జిల్లాలకు చెందిన 450 మంది ట్రైనీ కానిస్టేబుళ్ళ పాసింగ్ అవుట్ పరెడు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, కమాండెంట్ కె.వీరయ్య ల తో కలిసి వీక్షించారు.అనంతరం వారు మాట్లాడుతూ 9 నెలలు ఎంతో క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైని కానిస్టేబుల్ కు అభినందనలు తెలిపారు.
ఇక్కడ మంచి ఆక్సిజన్ పొందుతూ శిక్షణ పూర్తి చేసుకున్నారని ఇకనుంచి నూతన ఉత్సాహంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ ప్రాణవాయువు లాగా పనిచేయాలని అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం అంటేనే ఎన్నో సవాళ్ళతో కూడుకున్న ఉద్యోగం అని, శారీకంగా,మానసికంగా దృఢంగా ఉన్నపుడే ఎలాంటి సవాల్లనైనా ఎదుర్కోగలుగుతామని పేర్కొన్నారు.
ఈ ట్రైనింగ్ అనంతరం కూడా రోజు వ్యాయామం చేసి ఫిట్ గా ఉండాలన్నారు.పోలీసుశాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు అని, అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని ట్రైనీ కానిస్టేబుల్స్ కు సూచించారు.ఎంతో కష్టబడి చదివించిన తల్లితండ్రుల కలల్ని సాకారం చేయాలని అన్నారు.
మీరు ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ మీ యొక్క 36 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయ్యేవరకు ఇక్కడ శిక్షకులు నేర్పిన శిక్షణ తోడ్పడుతుందని అన్నారు.పాసింగ్ అవుట్ పరేడ్ లో భాగంగా శిక్షణార్ధులు చేసిన కవాతు అందరిని ఎంతో ఆకర్షించిందన్నారు.అనంతరం కమాండెంట్ కె వీరయ్య శిక్షణార్ధులతో ప్రమాణం చేయించారు.
ఇంకా శిక్షణలో ఇండోర్,అవుట్డోర్,ఫైరింగ్,అల్ రౌండ్ గా ఉత్తమ ప్రతిభ కనబరిచిన శిక్షణార్థులకు బహుమతులు అందజేశారు. ఈ 9 నెలల శిక్షణలో తోడ్పాటును అందించిన శిక్షకులకు,అధికారులకు, సిబ్బంది కి బహుమతి ప్రదానం చేశారు.తరువాత శిక్షణార్థులు వివిధ విన్యాసాలతో అలరించారు.
అందులో ముఖ్యంగా కరాటే విన్యాసాలు,సెల్ఫ్ డిఫెన్స్, సెంట్రీ పోస్ట్ డిఫెన్స్ విన్యాసాలు, చేతుల మీదుగా వాహనాలు పోనివ్వడం వంటి విన్యాసాలు చేశారు.చివరగా 12 బెటాలియన్ కి చెందిన పైప్ బ్యాండ్ బృందం వారి యొక్క బ్రాండ్ ప్రదర్శన అందరిని ఎంతో ఉత్సాహపరిచింది. బ్రాండ్ బృందాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు యం. వెంకటేశ్వర్లు, సి.హెచ్ ఆంజనేయ రెడ్డి,నర్సింగ్ వెంకన్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అతీక్ ఉర్ రెహమాన్, యూనిట్ మెడికల్ఆ ఆఫీసర్ షర్మిల దేవి, ఆర్.ఐ లు ,ఆర్ఎస్సై లు,ఇతర సిబ్బందితో పాటు శిక్షణార్ధుల యొక్క కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!
-
నిజాలను నిర్భయంగా రాస్తున్న మన సాక్షి పత్రిక.. అడిషనల్ ఎస్పీ పీ.మౌనిక..!
-
District collector : వంటగది శుభ్రంగా, భోజనం నాణ్యత ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!










