Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. పాఠశాలలో మెనూ పాటించని ఏజెన్సీ నిర్వాహకులకు మేము జారీ..! 

District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. పాఠశాలలో మెనూ పాటించని ఏజెన్సీ నిర్వాహకులకు మేము జారీ..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రభుత్వ పాఠశాలలలో రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాల ను సందర్శించి విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

పాఠశాలను చివరగా ఏ అధికారి విజిట్ చేశారని హెచ్ ఎం ను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీడీఓ పాఠశాలను విజిట్ చేసినట్లు తెలుసుకున్న కలెక్టర్ విజిటర్ రిజిస్టర్ ను చూశారు. కానీ అందులో ఎంపీడీఓ విజిట్ చేసినట్లు సంతకం లేకపోవడం పై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎవరైనా జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాఠశాల విజిట్ కు వస్తే వారితో రిజిస్టర్ లో సంతకాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఫుడ్ టేస్ట్ రిజిస్టర్, అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్, స్టూడెంట్ ఫుడ్ కమిటీ రిజిస్టర్, స్టాక్ రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం టేస్ట్ చేసిన తర్వాత భోజనం ఎలా ఉందో రిమార్క్ ను రిజిస్టర్ లో రాయాలన్నారు.

గుడ్, యావరేజ్, నార్మల్ ఇలా మూడు రకాల అభిప్రాయాలను తప్పనిసరిగా రాస్తేనే మరుసటి రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటారని సూచించారు. మోను పట్టికను పరిశీలించారు. 6వ తరగతి గదిలోకి వెళ్ళిన కలెక్టర్ విద్యార్థులు కింద కూర్చోవడం చూసి విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవా అని ప్రశ్నించారు.

ఒక్కో తరగతిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, తెలుగు, ఇంగ్లీష్ తరగతులను కంబైడ్ గా నిర్వహించడం వల్ల బెంచీలు సరిపోవడం లేదని హెచ్ ఎం కలెక్టర్ కు తెలిపారు. అయితే ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు ?.. ఎంత మంది గైర్హాజరు అయ్యారో బోర్డు మీద రాయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పాఠశాల పై అoతస్తులో గల ఓపెన్ హాల్ కు ఎందుకు తాళం వేశారని అడిగారు. ఓపెన్ హాల్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తనకు బిల్లు చెల్లించలేదని హాల్ కు తాళం వేసుకుని వెళ్లారని డీఈఓ గోవిందరాజులు కలెక్టర్ కు తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లు ఇచ్చినా.. ఇవ్వక పోయినా తాళం వేసుకుని వెళ్లరాదని, వెంటనే హాల్ ను తెరిపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం పాఠశాల లో బియ్యం బస్తాలను కలెక్టర్ పరిశీలించారు. బియ్యం, వంటకు వినియోగించే సరకులను నిల్వ ఉంచే గది ఎల్లపుడూ శుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. అలాగే రాగి జావ సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ నిల్వ ఉంచే గదిలో సెల్ఫ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గత నెల బియ్యం స్టాక్ ఎప్పుడూ వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగది లోకి వెళ్ళిన కలెక్టర్ అక్కడ విద్యార్థులకు వండు తున్న అన్నం, పప్పు ను చూసి మెనూ ప్రకారం పప్పుతో పాటు కర్రీ కూడా వండాలని ఎందుకు వoడ లేదని ఏజెన్సీ యువకులను నిలదీశారు. మెనూ ప్రకారమే బిల్లులు తీసుకుంటున్నారని అలాంటప్పుడు మెనూ ప్రకారమే పెట్టాలని తేల్చి చెప్పారు.

తమకు గత ఆరు నెలలుగా బిల్లులు రాలేదని వంట ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్ కి తెలపడంతో సంతృప్తి చెందని ఆమె ఎన్ని సంవత్సరాలుగా ఏజెన్సీ నడుపుతున్నారని కలెక్టర్ ప్రశ్నించగా 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నట్లు ఏజెన్సీ నిర్వాహకురాలు చెప్పడంతో 6 నెలల బిల్లులు రాకపోతే మెనూ ప్రకారం భోజనం పెట్టరా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించని ఏజెన్సీ నిర్వాహకురాలికి మోమో జారీ చేయాలని డీఈఓ ను ఆదేశించారు.

మొత్తం పాఠశాల విజిట్లకు సంబంధించిన అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించి, పూర్తిస్థాయిలో రిపోర్ట్ తనకు ఇవ్వాలని డీ ఈ ఓ ను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, మున్సిపల్ కమిషనర్ సునీత, పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వహణ సమన్వయకర్త యాదయ్య శెట్టి పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు