TG News : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కెఎఫ్ బీర్లు ఇక బంద్, ఎందుకంటే..!
TG News : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కెఎఫ్ బీర్లు ఇక బంద్, ఎందుకంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మద్యం ప్రియులకు ఎంతో ఇష్టమైన కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా నిలిపివేసింది.
తెలంగాణలో కెఎఫ్ బీర్ల సరఫరా చేయలేమని ఆ కంపెనీ స్పష్టం చేసింది. పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు బీర్ల ధరలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ కింగ్ ఫిషర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
బీర్లలో కింగ్ ఫిషర్ బీర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటున్న సంగతి తెలిసిందే. గత వేసవికాలంలో కూడా కెఎఫ్ బీర్లు నో స్టాక్ అని వైన్ షాప్ లలో బోర్డులు వెలిశాయి చూశాము. మరో రెండు మాసాల్లో వేసవికాలం రాబోతున్న తరుణంలో కెఎఫ్ కంపెనీ తీసుకున్న నిర్ణయంతో మందుబాబులకు షాక్ తగిలింది.
తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ పెండింగ్ బిల్లులు ఉన్నందున బీర్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు కంపెనీ పేర్కొన్నది. అయితే పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు బీర్ల ధరలు పెంచేందుకు ఆమోదం తెలుపుతుందా..? లేదా..? వేచి చూడాలి.
MOST READ :
-
Gold Price : పసిడి ధర మళ్లీ పై పైకి.. తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై క్లారిటీ.. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!
-
Gold Price : హైదరాబాదులో తులం బంగారం రేటు ఎంతంటే..?









