Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsక్రైం

Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!

Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ నుంచి అకౌంట్ లోకి ఎంతో కొంత డబ్బు పంపి జంపుడ్ డిపాజిట్ స్కామ్ కు పాల్పడుతున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అప్రమత్తం చేస్తుంటారు. కాగా కొత్త తరహాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి అవగాహన కల్పించారు. జంపుడ్ డిపాజిట్ స్కామ్ తో జాగ్రత్త.. అంటూ అలర్ట్ చేశారు.

దీని ద్వారా ఎవరో గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు యూపీఐ నుంచి మీ ఖాతాలలోకి డబ్బులు పంపిస్తారు. దాంతో తెగ సంబరపడి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే.. పిన్ ఎంటర్ చేశారో ఇక అంతే. మీ ఖాతా గల్లంతయినట్లే. బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలో యూపీఐ ఐడి లకు పేమెంట్స్ లింకులను పంపి సైబర్ నేరగాళ్లు ఖాతాలోని డబ్బులను దోచేస్తున్నారు.

అలాంటి ఫేక్ పేమెంట్స్ లింక్స్ కు స్పందించవద్దని ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలి.

MOST READ : 

మరిన్ని వార్తలు