తెలంగాణBreaking Newstravelజిల్లా వార్తలునారాయణపేట జిల్లా
ప్రయాణించేటప్పుడు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి..!
ప్రయాణించేటప్పుడు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రయాణికులు ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ. ఆంజనేయులు తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం ఆర్టీసీ బస్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులను, అనుమానిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో అకస్మికంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.
బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బ్యాగులు, విలువైన బంగారు వస్తువులు, సెల్ ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రయాణించేటప్పుడు కొత్త వ్యక్తులు మాటలు కలిపి ఏమర్చి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా తినిబండారాలు ఇస్తే తీసుకోరాదని సూచించారు. ప్రజల అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని కోరారు.
MOST READ :
-
Gold Price : సంక్రాంతికి మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ ధర..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!
-
Nalgonda : 26న ప్రారంభమయ్యే పథకాలు వారికి అస్సలు ఇవ్వొద్దు..!
-
TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
-
Ration Cards : రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!









