Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsసంక్షేమంహైదరాబాద్

Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదిరిపోయే మరో గుడ్ న్యూస్..!

Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అదిరిపోయే మరో గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలైన వారికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నారు.

ఒక్కొక్క లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతలుగా ప్రభుత్వం సహాయం చేయనున్నది. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఒక లక్ష రూపాయలు కలిపి 6 లక్షల రూపాయలను అందజేయనున్నది. కాగా 5 లక్షల రూపాయల లోనే పేదవారు మంచి ఇల్లు నిర్మాణం చేసేందుకు గాను ప్రభుత్వం మరో విధంగా సహాయం చేయాలని భావిస్తుంది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించనున్నారు. అందుకుగాను జిల్లాలలో ఇసుక సరఫరాకు అనువైన రీచ్ లను, వాగులను గుర్తించాలని కూడా ప్రభుత్వం అధికారులను ఇప్పటికే ఆదేశించింది.

ఇది ఇలా ఉండగా ఇందిరమ్మ ఇంటికి అవసరమైన ఇటుకలను కూడా మహిళా సంఘాలచే సరఫరా చేయించాలని భావిస్తుంది. ఒక్కొక్క మండలానికి మూడు చొప్పున మహిళా సంఘాలను ఎంపిక చేసి వారికి బ్యాంకు రుణాలు అందజేసి ఇటుకల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

ఒక్కొక్క ఇటుకల తయారీ యూనిట్ కు 18 లక్షల రూపాయలను ప్రభుత్వం రుణం అందించే అవకాశం ఉంది. ఆ మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులంతా మహిళా సంఘాలచే ఏర్పాటు చేసిన ఇటుకల తయారీ కేంద్రంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీలు, సిమెంటు కూడా తక్కువ ధరకు ఇచ్చే విషయంపై కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. తక్కువ ధరకు ఇచ్చేందుకు వచ్చే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నది.

దానివల్ల ప్రభుత్వం అందజేసే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం లోనే ఇంటి నిర్మాణం పూర్తయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలకు ఇటుకలు, స్టీలు, సిమెంటు అందితే భారీగా మేలు చేకూరి అవకాశం ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు