Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి.. కలెక్టర్ ఆదేశం..!

District collector : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి.. కలెక్టర్ ఆదేశం..!

మఠంపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పెదవీడు, చౌటపల్లి గ్రామాలలో జరుగుతున్న సర్వేను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవార్. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహర భద్రత కార్డులు, ఇందిర ఇండ్లు, లబ్ధిదారుల ఎంపికకు జరుగుతున్న సర్వే ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

దీనిలో భాగంగా పెదవీడు, చౌటపల్లి గ్రామాలలో రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు సంబంధించిన పట్టా భూములను, అసైన్డ్ స్థలాలను పరిశీలించారు. పెదవీడులోని 252, 253, 540 సర్వే నెంబర్లలో ఉన్న మైనింగ్ లీస్ ఏరియా అలాగే విశ్వంభరా సిమెంట్ భూములను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే నెంబర్ 252, 253, లో ఉన్న రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూములను అలాగే వ్యవసాయం చేయని భూములను కలెక్టర్ పరిశీలించారు.

చౌటపల్లి లోని 875 సర్వే నెంబర్లు లావుణి పట్టా భూములను కలెక్టర్ పరిశీలించారు. సర్వేనెంబర్ 540 వ్యవసాయ, వ్యవసాయేతర భూములను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన డేటాను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లుగా బాధ్యతగా, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేనెంబర్ 252, 253, 540 సర్వే నెంబర్లలో కొంత సాగు చేయని భూమిని గుర్తించినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు.

సాగు చేయని భూములు కూడా రైతుబంధు పొందినట్లుగా క్షేత్ర పరిశీలనలో పరిశీలించడమైనదని సర్వే పూర్తి అయిన తదుపరి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు, తాహశీల్ధార్
మంగ, డిప్యూటీ ల్యాండ్ సర్వేయర్ వంశీ, ఏ డి ఏ రవికుమార్, ఎంపిడిఓ శ్రీనివాస్, ఏఈఓ రమ్య, మండల సర్వేయర్ సమీర్, అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

|MOST READ : 

  1. District collector : ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్..!

  3. Miryalaguda : ఆ దొంగల రూటే సపరేట్.. ఆంధ్రాలో కొట్టేసి.. తెలంగాణలో విక్రయం..!

  4. Viral Video : ఒంటినిండా విష సర్పాలు.. మహా కుంభమేళాలో అఘోరీ హల్ ఛల్.. (వీడియో వైరల్)

  5. Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!

మరిన్ని వార్తలు