Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

Hyderabad : భార్యను చంపి ముక్కలు చేసిన ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!

Hyderabad : భార్యను చంపి ముక్కలు చేసిన ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!

మన సాక్షి , హైదరాబాద్ :

మీర్ పేటలో భార్యను చంపి ముక్కలు చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.  పోలీసుల విచారణలో నిందితుడు గురుమూర్తి అనేక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మీర్పేటలో తన భార్యను దారుణంగా హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు అనేక విషయాలు  వెల్లడించాడు. తన భార్యను తానే హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే తాను చంపిన అనడానికి ఆధారాలు ఏవీ అని పోలీసులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా కోర్టులో మీ సంగతి చూస్తానంటూ పోలీసులను బెదిరిస్తున్నట్లు సమాచారం. గురుమూర్తి హత్య చేశాడని తెలుస్తున్నా.. ఆధారాలు దొరక్కుండా చేయడంతో పోలీసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.  ఆధారాలను సేకరించేందుకు పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

పోలీసులతో గురుమూర్తి  ఏమన్నాడంటే.. ఈనెల 14వ తేదీన తన భార్య , పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్ళామని చెప్పాడు. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి తాను తన భార్య ఇంటికి వచ్చినట్టు చెప్పాడు.  భార్యతో గొడవ జరిగిందని తాన భార్య తాళి తీసి మొహం పై విసరడంతో కోపం వచ్చి కొట్టినట్లు చెప్పాడు. గోడకు అదిమి పెట్టగా స్పృహ తప్పి పడిందనుకున్నారని కానీ ఆ తర్వాత చనిపోయిందని తెలిసినట్లు గురుమూర్తి పేర్కొన్నాడు.

కాగా శవం మాయం చేయడానికి ప్లాన్ చేసి ఇంట్లో ఉన్న రెండు కత్తులతో శరీర భాగాలను కోసి వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కలను వేసి సుమారు ఆరు గంటల పాటు ఉడికించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడి చేసి బూడిదగా మార్చిన తర్వాత రెండు బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేసినట్లు చెప్పాడు.

ఆ తర్వాత ఫినాయిల్ తో ఇంట్లో రక్తం మొత్తం క్లీన్ చేశానని ఒక్క ఆదరణ కూడా పోలీసుల దొరక్కుండా చేసినట్లు చెప్పాడు. మూర్తి చెప్పిన విషయాలన్నీ పోలీసులు రికార్డు చేశారు. కానీ పోలీసులకు మాత్రం ఆధారాలు దొరక్కుండా చేశాడు.

MOST READ : 

మరిన్ని వార్తలు