Grama Sabha : గ్రామసభల దరఖాస్తులకు మోక్షం.. లేటెస్ట్ అప్డేట్..!
Grama Sabha : గ్రామసభల దరఖాస్తులకు మోక్షం.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు.
గత ఏడాది ప్రజా పాలన దరఖాస్తులు, కులగణన ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రజా పాలన దరఖాస్తులలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్ళను అర్హులుగా గుర్తించారు. దాంతో పాటు కుల గణన ఆధారంగా రేషన్ కార్డుల సర్వే చేపట్టారు. రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించగా కొత్తగా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ కూలీల కోసం ప్రారంభించారు.
గ్రామ సభలలో భారీగా దరఖాస్తులు :
తెలంగాణ వ్యాప్తంగా జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రామ సభలలో ప్రభుత్వ నాలుగు సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేశారు.
కాగా అనేక మంది తమకు అర్హత ఉన్నప్పటికీ లబ్ధిదారులుగా గుర్తింపు ఇవ్వలేదని పేర్కొనడంతో ప్రభుత్వం గ్రామసభలలో అర్హుల జాబితాతో పాటు కొత్తగా మరోసారి దరఖాస్తులను స్వీకరించారు. నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించారు. కాగా లక్షల్లో కొత్త దరఖాస్తులు వచ్చాయి.
కొత్త దరఖాస్తుదారులకు మోక్షం :
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు గ్రామసభలలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ముఖ్యం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నాలుగు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా గ్రామసభలలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను కూడా పరిశీలించి వారిలో అర్హులైన వారిని గుర్తించనున్నారు.
వారం రోజుల పాటు కొత్త దరఖాస్తుల పరిశీలన చేసిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సంక్షేమ పథకాల అమలు మార్చి 31వ తేదీ వరకు కొనసాగనున్నది. కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు చేయనున్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : నాలుగు పథకాలకు ముహూర్తం ఖరారు.. మండలానికి ఒక గ్రామం ఎంపిక..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!









