Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!
Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జనవరి 26వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. గతంలో రైతులకు రైతుబంధు ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు రెండు విడుదలుగా ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున రెండు విడుదలుగా రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. అందులో భాగంగా ఒక విడత ఎకరానికి 6000 రూపాయలు చొప్పున జనవరి 26 అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి.
ఈ పథకం ద్వారా 4,41, 911 మంది రైతుల ఖాతాలలో సోమవారం 569 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 32 జిల్లాలలో 577 గ్రామాలకు నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9,48,333 ఎకరాలకు సంబంధించి 530 కోట్ల రూపాయలను జమ చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 577 గ్రామాల్లో 4,41, 911 మంది రైతుల ఖాతాలలో 569 కోట్ల రూపాయలు జమ చేశారు. రైతుల ఖాతాలలో జమ చేసిన డబ్బులను పలు రైతులు రైతు భరోసా పథకం అందినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలను సైతం పోస్ట్ చేస్తున్నారు. ఆనందంలో రైతులు ఉన్నారు.
రైతుల ఖాతాల్లోకి…
రైతు భరోసా డబ్బులు ✅Rythu Bharosa amount credited to Farmers
రైతు భరోసా పధకం కింద ఎకరాకు 6000 రూపాయలు చొప్పున… ఈ రోజు రైతుల అకౌంట్లో జమ అయ్యాన నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు#RythuBharosa pic.twitter.com/aaJjPoSwq8
— Congress for Telangana (@Congress4TS) January 27, 2025
MOST READ :
-
Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!
-
Railway Recruitment : ఇండియన్ రైల్వేస్ లో కొలువుల జాతర.. వేతనం రూ.35000.. వెంటనే దరఖాస్తు చేయండి..!
-
Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!
-
Holiday : రేపు విద్యాసంస్థలకు సెలవు..!









