Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!
Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!
మన సాక్షి, నల్గొండ బ్యూరో :
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీమంత్రి కేటీఆర్ రైతుబంధు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు రైతులకు పెట్టుబడి సహాయం అందించే విధంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నాట్లు వేసేటప్పుడే ఇచ్చే వారని అన్నారు. కానీ రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు నాట్లప్పుడు కాకుండా ఓట్లప్పుడు ఇస్తున్నాడని ఎద్దేవ చేశారు. సాధారణ ఎన్నికల అనంతరం రైతులకు ఇచ్చేందుకు రైతుబంధు కోసమని తమ ప్రభుత్వం దాచిపెట్టిన డబ్బులను 7800 కోట్ల రూపాయలను రేవంత్ రాగానే పంపిణీ చేశాడని అన్నారు.
కానీ ఆ తర్వాత రైతు భరోసా పేరుతో కాలయాపన చేసి ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు వేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ పేరు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కొన్ని పథకాలకు కొంతమంది పేర్లు చెప్పగానే చిరస్థాయిగా వారి పేర్లే నిలిచిపోతాయన్నారు. అలాంటి వారిలో ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తాడని, రైతుబంధు పేరు చెప్పగానే కెసిఆర్ గుర్తొస్తాడని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలయ్యాక రైతు భరోసా పథకాన్ని రేవంత్ రెడ్డి రద్దు చేస్తాడని అన్నారు.
MOST READ :
-
Nalgonda : గులాబీ మయమైన నల్గొండ..!
-
District Collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ లో అమ్మితే లైసెన్సులు రద్దు..!
-
Scam Alert : మల్టీ లెవెల్ మార్కెటింగ్ గేటుగాళ్ల కొత్త ట్రిక్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!









