District Collector : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం.. భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ.. జిల్లా కలెక్టర్..!
District Collector : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం.. భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ.. జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
భూసేకరణఅధికారులు,నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో జిల్లాలో భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు.
భీమా ప్రాజెక్టు కు సంబంధించి జిల్లాలోని మక్తల్, మాగ నూర్, కృష్ణా మండలాల్లో పెండింగ్ లో ఉన్న 45.34 ఎకరాలకు అవార్డు పాస్ అయినందున వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆయా మండలాల తహసిల్దార్ లను ఆదేశించారు. అలాగే 28.56 ఎకరాలకు నష్టపరిహారం డబ్బు ఎస్.డీ.సీ ఖాతాలో జమ అయిందని, దీనిపై కేసు కూడా నడుస్తోందని ఎస్. డి. సి. రామ్ చందర్ నాయక్ జిల్లా కలెక్టర్ కి తెలిపారు.
74.61 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం డబ్బు కోర్టులో డిపాజిట్ చేసినట్లు ఎస్.డీ.సీ ( ఆర్డీవో) తెలిపారు. జిల్లా జడ్జిని సంప్రదించి వివరాలు తీసుకుంటామని ఆర్డీవో రామచందర్, నీటి పారుదల శాఖ ఎస్.ఈ.శ్రీధర్ కలెక్టర్ కు తెలిపారు. ఇదే కాకుండా భీమా ప్రాజెక్టు కింద ఇంకా 16.16 ఎకరాల భూసేకరణ వివిధ దశలలో పెండింగ్ లో ఉందని, అవార్డు పాస్ కాలేదని వారు తెలిపారు.
నారాయణ పేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాలలో 550 ఎకరాల భూసేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఇక ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి జూరాల పరిధిలో ముంపు ప్రభావిత అనుగొండ, అంకెన్ పల్లి, దాదన్ పల్లి, అలాగే సంగం బండ జలాశయం పరిధి లో ముంపు ప్రభావిత ఉజ్జల్లి, గార్లపల్లి, సంగం బండ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వీటితో పాటు భూత్పూర్, నేరేడు గాం ముంపు ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారానికీ ప్రభుత్వo ప్రత్యేక చొరవ తీసుకోనుందని కలెక్టర్ తెలిపారు.
అయితే సమావేశ ప్రారంభంలో ఎస్. డీ.సీ అధికారులు భూసేకరణకి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను తనకు ఇవ్వక పోవడంపై, సమావేశంలో ఫైల్స్ ఏమీ లేవని అధికారులు జవాబు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి భూ సేకరణ కార్యాలయ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు భూ సేకరణకు సంబంధించిన సమగ్ర వివరాలు, పూర్తిస్థాయి ఫైల్స్ తో హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
ఏమీ లేకుండా, వివరాలు ఇవ్వకుండా సమావేశానికి ఎందుకు వస్తారని నిలదీశారు. మరోసారి ఇది పునరావృతం కాకుండా ముందస్తుగా సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని పేర్కొన్నారు ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, ఆర్డీవో రామచందర్ నాయక్, మక్తల్ సర్కిల్ ఎస్. ఈ. శ్రీధర్, మహబూబ్ నగర్ సర్కిల్ ఎస్.ఈ. చక్రధరం, పి ఆర్ ఈ ఈ హీర్యా నాయక్, ఎస్ డి సి కార్యాలయ అధికారులు, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల తహాసిల్దార్లు పాల్గొన్నారు.
MOST READ :
-
ACB : ఫోన్ పే ద్వారా లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ సురేష్..!
-
Nalgonda : రైతుబంధు కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తాడు..!
-
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
Nalgonda : గులాబీ మయమైన నల్గొండ..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!









