తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : హెడ్ కానిస్టేబుల్ లకు ఏయస్ఐ లుగా పదోన్నతి..!

Nalgonda : హెడ్ కానిస్టేబుల్ లకు ఏయస్ఐ లుగా పదోన్నతి..!

నల్లగొండ, మనసాక్షి :

పదోన్నతి పొందిన యస్.ఐ లకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 10 మంది హెడ్ కానిస్టేబుల్ లకు , ఏ.యస్.ఐ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా జిల్లా ఎస్పీ స్టార్ లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పని చేయాలి అన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యల అడిగి తెలుసుకొని బాధితులకు సరిఅయిన న్యాయం జరిగే విదంగా పనిచేయాలని అన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని, దానిని పెంపొందే దిశగా పనిచేసి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

Nalgonda : కేసీఆర్.. నేను దెబ్బ కొడితే ఏక్కడ ఉంటావో తెలుసుకో.. మంత్రి కోమటిరెడ్డి పంచ్..!

CM Revanth Reddy : నారాయణపేటలో 3 కొత్త మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు..!

Kcr : నేను కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..!

Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!

 

మరిన్ని వార్తలు