CM Revanth Reddy : నారాయణపేటలో 3 కొత్త మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు..!
CM Revanth Reddy : నారాయణపేటలో 3 కొత్త మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తన నివాసంలో శుక్రవారం నారాయణపేట ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నియోజకవర్గంలోని వివిధ సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
నారాయణపేట , కొడంగల్ ఎత్తిపోతల పథకం లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం వలన నారాయణపేట రైతులకు అదనంగా వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది అని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పరిణిక రెడ్డి తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ధన్వాడ, కోయిలకొండ మండలంలోని డిగ్రీ కళాశాలలకు నూతన భవనాలు, ధన్వాడ కి డబుల్ లేన్ రోడ్డు మొదలగు వాటి గురించి చర్చించామన్నారు.
నియోజకవర్గంలో 3 కొత్త మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి చర్చించామని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు.
MOST READ :
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!
-
TG News : మాదకద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక నిఘా.. ఎక్సైజ్ అకాడమీలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ..!
-
Kcr : నేను కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..!
-
Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!









