Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

District collector : పిఎంశ్రీ నిధులు సక్రమంగా వినియోగించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : పిఎంశ్రీ నిధులు సక్రమంగా వినియోగించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ అధికారులతో మాట్లాడుతూ పీఎం శ్రీ కార్యక్రమంలో అమలుపరుస్తున్న పనుల గురించి సమీక్షించారు.

జిల్లాలో మొదటి విడతగా 12 పాఠశాలలు రెండో విడతగా ఏడు పాఠశాలలు ఎంపిక అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అదేవిధంగా పిఎం శ్రీ ఎంపికైన పాఠశాలలో కార్యక్రమము అమలు తీరుని జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద రాజు ద్వారా అడిగి తెలుసుకున్నారు. పి ఎం శ్రీ లో వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. సంబంధిత పాఠశాలల ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలను డాక్యుమెంట్ రూపంలో తయారుచేసి ప్రభుత్వానికిక పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పదవ తరగతి సమీక్ష సమావేశంలో ఉపాధ్యాయుల పనితీరుపై ఆ సహనం వ్యక్తపరిచారు. వచ్చే నెలలో పదవ తరగతి పరీక్షలు జరగబోతున్నాయని అందుకుగాను ప్రతి సబ్జెక్ట్ టీచర్ తమవంతుగా కృషి చేస్తూ ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.

ఎక్కడైతే తక్కువ ప్రొఫెర్మెంట్స్ ఉన్న పాఠశాలలో సంబంధిత విషయ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలో గణిత, భౌతిక శాస్త్రం లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని వారికి అర్థం అయ్యే విధంగా ప్రణాళికలను తయారు చేసుకొని అందరూ ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు.

జిల్లాలోని సబ్జెక్ట్ ఫోరమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వాలని, విద్యార్థులకు విషయాల వారీగా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం లో నాణ్యత పాటించాలని విద్యార్థులకు మూడవ స్లిప్ టెస్ట్ అయిపోయిన వెంబడే మళ్లీ సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు.

జిల్లాలోని అందరూ ప్రధానోపాధ్యాయులు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం గోవిందరాజులు, ఎఫ్ ఏ ఓ. చారి, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు విద్యాసాగర్, శ్రీనివాస్, రాజేంద్రకుమార్ నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

■ MOST READ : 

  1. Narayanpet : ఇంటర్ నెట్ నిత్యావసరంగా మారింది.. ట్రైని కలెక్టర్ గరీమ నరుల..!

  2. Nalgonda : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 22 మంది అభ్యర్థులు..!

  3. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

  4. Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!

  5. District collector : పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి.. జిల్లా కలెక్టర్ సూచనలు..! 

మరిన్ని వార్తలు