Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : ఇంటర్ నెట్ నిత్యావసరంగా మారింది.. ట్రైని కలెక్టర్ గరీమ నరుల..!

Narayanpet : ఇంటర్ నెట్ నిత్యావసరంగా మారింది.. ట్రైని కలెక్టర్ గరీమ నరుల..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నిత్యావసరంలో ఇంటర్నెట్ భాగమైపోయిందని జిల్లా ట్రైనీ కలెక్టర్ గరిమానరుల అన్నారు. మంగళవారం సేఫర్ ఇంటర్నెట్ డే సందర్బంగా కలెక్టర్ సమావేశ మందిరం లో నిర్వహించిన కార్యక్రమం లో ట్రేని కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ నెట్ అనేది మనలో నిత్యావసర భాగంగా మారిందన్నారు.

సోషల్ మీడియా అనేది నెట్ ద్వారానే నడుస్తుందన్నారు. ప్రపంచం లో నెట్ సేవలు నిలిచిపోతే స్టాక్ మార్కెట్, సోషల్ మీడియా మరియు ఇతర సేవలకు ఆటంకం కల్గుతుందన్నారు. దీనికి తోడుగా సైబర్ నేరాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదన్నారు. మీసేవ కేంద్రలలో సర్టిఫికెట్ లాకై ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవడం జరుగుతోం దన్నారు.

మరీ ముఖ్యంగా ఆర్ధిక లావాదేవీలు, ఫుడ్ డెలివరీ, షాపింగ్, టికెట్బుకింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్.. ఇలా ప్రతి అవసరానికి యాప్ లు ఉన్నాయన్నారు. ప్రతి మనిషి జీవితంలో గోప్యత ఎంతో ముఖ్యం అని, ఆన్లైన్ ఖాతాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తప్పనిసరి అన్నారు. పాస్వర్డ్ అక్షరాలు, అంకెలు, స్పెషల్
క్యారెక్టర్ల కలయికగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ
సంస్థలు సూచిస్తున్నాయనీ, పాస్వర్డ్ బలంగా ఉంటేనే
ఆన్లైన్ గోప్యతకు భంగం వాటిల్లదని పేర్కొన్నారు.

ఈ సమావేశం లో కలెక్టరేట్ ఎ ఒ. జయసుధ, సి డి సెక్షన్ సూపర్ఇండెంట్స్ అఖిల ప్రసన్న, కళ్యాణి,ఈ డి ఎం విజయ్ కూమార్, మి సేవ ఆపరేటర్స్ , ఎన్ ఐ సి సిబ్బంది ఆనంద్ మాండ్రే, సంపత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : అక్రమ ఇసుక రవాణాపై జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. డయల్ 100 కు చేయండి..!

  2. Nalgonda : అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు..!

  3. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు