Hyderabad : హైదరాబాదులో దారుణం.. అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య.. (వీడియో)
Hyderabad : హైదరాబాదులో దారుణం.. అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య.. (వీడియో)
మన సాక్షి, హైదరాబాద్ :
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఒకరిపై కత్తులతో దాడి చేశారు. సినిమాను తలపించేలా రోడ్డుపై వీరంగం సృష్టించారు. రోడ్డుపై వాహనాలు వెళుతున్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా దారుణంగా హత్యకు పాల్పడ్డారు. దాంతో మేడ్చల్ జిల్లాలో భయానక వాతావరణం నెలకొన్నది.
వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్(25) అనే వ్యక్తిని ఆదివారం నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు. రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా ఎలాంటి భయం లేకుండా కత్తులతో దాడి చేసి నడుచుకుంటూ వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఉమేష్ కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది.
మేడ్చల్.. పట్టపగలు నడిరోడ్డుపై హత్య#Medchal #Hyderabad #Telangana #MedchalMurder pic.twitter.com/UTSmHj14WN
— ఆధునిక వికటకవి (@vikatakavi369) February 16, 2025









