Hyderabad : అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్..!
Hyderabad : అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ సరఫరాదారులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రం జంషెర్ పూర్ కు చెందిన శతాబ్ది మన్నా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంటుంది.
ఉద్యోగం లేకపోవడంతో చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఆమెకు ఆఫ్రికా రాష్ట్రానికి చెందిన వారెన్ కొకరంగాతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి డ్రగ్స్ సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొకరంగా నుండి ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్న శతాబ్ది మన్నా హైదరాబాద్ మియాపూర్ లో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు నగరానికి వచ్చింది.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న టీఎస్ న్యాబ్ అధికారులు మియాపూర్ పోలీసుల సహాయంతో అక్కడి బస్టాండ్ లో వేచి ఉన్న శతాబ్ది మన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి రూ.6 లక్షల విలువైన 60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికాకు చెందిన కొకరంగా పరారీలో ఉన్నాడని తెలిపారు.
MOST READ :
-
Power Shock : కాటేసిన కరెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత..!
-
Nalgonda : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ధార్ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ అరెస్ట్..!
-
GPay : గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!









