Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

Artificial intelligence : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ బోధన.. కంప్యూటర్ ల్యాబ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

Artificial intelligence : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ బోధన.. కంప్యూటర్ ల్యాబ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో పైలట్ గా ఎంపిక చేయబడ్డ 10 పాఠశాలల్లోని 114 మంది విద్యార్థులకు ఏ ఐ ఆధారిత అభ్యసనం అందించేందుకు సోమవారం ఆయా పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ ఏ ఎక్స్ ఎల్ కంప్యూటర్ ల్యాబ్ లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు.

జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ ల్యాబ్ ప్రారంభిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసనను మరింత ఆకర్షణీయంగా, ఇంటరాక్టివ్ గా నిర్వహించుటకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగ్గా సహకరిస్తుందని దీని ద్వారా విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తూ వారికి తగ్గ అభ్యాస కృత్యాలను జనరేట్ చేయడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసనం పట్ల మరింత ఉత్సుకత ను కలిగించేలా బోధన జరపవచ్చని అన్నారు.

విద్యార్థుల కంప్యూటర్ ల్యాబ్ లో ముచ్చటిస్తూ ఇలాంటి నూతన ఓ రవడిని మన జిల్లాలో ప్రారంభించడానికి చిన్నారుల ఉత్సాహమే ప్రేరణ అని, పిల్లలు నిరంతరంగా ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్ ను వినియోగించాలని సూచించారు.

ఎంపిక చేయబడ్డ 10 పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతి విద్యార్థులకు వారానికి రెండు రోజులపాటు 45 నిమిషాల అభ్యసనం కంప్యూటర్ లాబ్ ద్వారా నిర్వహిస్తామని డిఈవో గోవిందరాజులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉపాధ్యాయుల శిక్షణను పూర్తి చేయడం జరిగిందని, ఆయా పాఠశాలలకు నాలుగు కంప్యూటర్లను ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను జిల్లా కలెక్టర్ వారి సౌజన్యంతో అందించడం జరిగిందని డీఈఓ తెలిపారు.

జిల్లాలో మూడుమాల్, గుడెబలుర్, కర్ని, శివాజీ నగర్ నారాయణపేట, కొల్లంపల్లి కంసాన్పల్లి, పల్లెర్ల, నిడిజిం , గుండు మాల్ మరియు నాచారం పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగిందని ఉపాధ్యాయులను నిరంతరం సంబంధిత ఎంఈవోలు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని రోజువారిగా సమీక్షిస్తారని ప్రతివారం విద్యార్థుల యొక్క అభ్యసనను డాష్ బోర్డు ద్వారా జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని ఏ ఎస్ ఓ. విద్యాసాగర్ తెలిపారు.

కంప్యూటర్ల ప్రారంభోత్సవానికి అవసరమైన కంప్యూటర్లను ఆయా పాఠశాలలకు అందించడం జరిగిందని స్కూల్ గ్రాంట్ నుంచే ఇంటర్నెట్ కనెక్షన్ ను పొందాల్సిందిగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయులు బాలరాం నాయక్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Additional Collector : ఇంటర్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!

  2. Miryalaguda : కరాటే పోటీల్లో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ..!

  3. Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!

  4. Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు