Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : హుక్కా తాగుతున్న 9 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు..! 

Suryapet : హుక్కా తాగుతున్న 9 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు..! 

మన సాక్షి, హుజూర్ నగర్ :

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు జాతర సందర్భంగా గంజాయి హుక్కా వంటివి జోరుగా నిర్వహించారని స్థానికంగా పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది జాతరకు వచ్చే యువకులు యువతులను టార్గెట్ చేసుకొని వీటిని పెద్ద ఎత్తున నిర్వహించినట్లు సమాచారం. వీటిని వాస్తవం అనే విధంగానే బుధవారం రాత్రి కోదాడ వెళ్లే రోడ్డు పక్కన ఓ ఇంట్లో హుక్కా తాగుతున్న వారిని సూర్యాపేట సీసీఎస్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం.

వీరిని పట్టుకొని మేళ్లచెరువు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.. ఈ 9 మందితో పాటు ఆ ఇంటి యజమానిని కూడా తీసుకొని విచారణ పోలీసులు చేస్తున్నట్లు అదుపులోకి తెలుస్తుంది. పట్టుబడిన వారిలో 8 మంది యువకులతో పాటు ఒక యువతి కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. వీరితో పాటు నలుగురు యువకులు ఒక యువతి పరారీ అయినట్లు సమాచారం.

ప్రస్తుతం నిందితులు మేళ్లచెరువు పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. పట్టుబడిన యువకులు ఎక్కడి వారు. పట్టుబడిన వ్యక్తి హుక్కా ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. యువతీ యువకులకు హుక్కా అమ్ముతున్నారనే విషయం ఎవరి ద్వారా తెలిసింది. అనే అంశాల పై పోలీసులు ఆరా తీస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

MOST READ : 

  1. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!

  3. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!

  5. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!

మరిన్ని వార్తలు